కాణిపాకం, ఆగష్టు 1 మన ద్యాస (నాగరాజ సరకింటి )

చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం కాణిపాకంలో శనివారం స్థానిక ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా కాణిపాకం వినాయకుని దర్శించుకొని స్వామివారి నిత్య అన్నదానం కు 1,00116రూ విరాళం అందించారు. అనంతరం బాలాజీ కల్యాణ మండపంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు ఏర్పాటు చేసిన పుట్టినరోజు వేడుకలలో పాల్గొని భారీ కేక్ కోసి అందరికి పంచి పెట్టారు. పలువురు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు, తెలుగుదేశం, జనసేన, బిజెపి కూటమి నాయకులకు,కార్యకర్తలకు, శ్రేయోభిలాషులకు, పత్రికా-మీడియా మిత్రులకు నా మనస్ఫూర్తి కృతజ్ఞతలు తెలిపారు. మీరు నాపై చూపించిన ఈ అపారమైన ప్రేమాభిమానాలు నియోజకవర్గ అభివృద్ధికి, ప్రజా సేవకు మరింత బాధ్యతతో పనిచేసేలా నాలో సరికొత్త ఉత్సాహాన్ని నింపాయి. మీ అందరి నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ,నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్లేందుకు నిరంతరం శ్రమిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా టిడిపి అధ్యక్షుడు షణ్ముగం రెడ్డి, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ నాయుడు, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, సి. కె. లావణ్య, నియోజకవర్గ 5మండలాల కన్వీనర్ లు ఎన్.పి. ధరణి, దొరబాబు చౌదరి, హరిబాబు నాయుడు, వెంకటేష్ చౌదరి, మురార్జీ యాదవ్,ఎన్.పి. జయప్రకాష్ నాయుడు, చిత్ర నాయుడు, పూతలపట్టు బాబురావు, గంగారపు గోపి, ఐరాల జెడ్పిటిసి సుచిత్ర, ఎన్.పి. విక్రమ్, శ్రీ ఇండస్ట్రీ అధినేత ఈశ్వర్ నాయుడు, కోదండ యాదవ్, అర్ధగిరి చైర్మన్ ఏ రఘపతి, సాప్ చైర్మన్ పి రంజిత్ రెడ్డి మరియు నియోజకవర్గ కూటమి నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *