తవణంపల్లి జూలై 30 మన ద్యాస (నాగరాజ సరకింటి )
తవణంపల్లి మండలం మత్యం పంచాయతీ పరిధిలోని జోగివారిపల్లె గ్రామం సమీపంలోని మామిడి తోటలో నగదు పందేలు కాస్తూ “మంగతా (ఇన్ అండ్ అవుట్)” అనే జూదం ఆడుతున్న ఐదుగురిని తవణంపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.11,230 నగదు, 52 ప్లేయింగ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు.పోలీసుల వివరాల ప్రకారం, గురువారం సాయంత్రం 5 గంటల సమయంలో జోగివారిపల్లె గ్రామ సమీపంలోని మామిడి తోటలో కొందరు వ్యక్తులు గట్టిగా కేకలు వేస్తూ నగదు పందేలు కాస్తూ జూదం ఆడుతున్నట్లు సమాచారం అందింది. వెంటనే తవణంపల్లి పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ జి. రమేష్ బాబు సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకుని దాడి నిర్వహించారు. ఈ దాడిలో ఐదుగురు వ్యక్తులు జూదం ఆడుతుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.అరెస్టయిన నిందితులు:1. సి. లావా కుమార్ (31), జోగివారిపల్లె గ్రామం, మత్యం పంచాయతీ, తవణంపల్లి మండలం.2. జె. గుణశేఖర్ (29), మొగిలి వెంకటగిరి గ్రామం, బంగారుపాళ్యం మండలం, చిత్తూరు జిల్లా.3. జె. శంకరయ్య (60), జోగివారిపల్లె గ్రామం, మత్యం పంచాయతీ, తవణంపల్లి మండలం.4. జి. దేవరాజులు (45), జోగివారిపల్లె గ్రామం, మత్యం పంచాయతీ, తవణంపల్లి మండలం.5. పి. రవి (34), శివపురం గ్రామం, కాట్పాడి తాలూకా, వెల్లూరు జిల్లా.నిందితుల వద్ద నుంచి రూ.11,230 నగదు, 52 ప్లేయింగ్ కార్డులను పోలీసు పంచనామా ద్వారా స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై తవణంపల్లి పోలీస్ స్టేషన్లో క్రైం నెం.49/2026గా, ఏపీ గేమింగ్ యాక్ట్ సెక్షన్ 9(1) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.