• కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించినా మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి

మన ధ్యాస ప్రతినిధి విశాఖపట్నం సీతంపేట జూలై 7 :దక్షిణ నియోజకవర్గం 30 వ వార్డు నుండి జనసేన పార్టీకి చెందిన 100మంది  కుటుంబాలు వైఎస్సార్సీపీలోకి చేరారు.ఆవార్డు వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు దశమంతుల మాణిక్యాలరావు ఆధ్వర్యంలో వార్డు SC సెల్ అధ్యక్షురాలు దశమంతుల సంతోషి నిర్వహణలో వారంతా పార్టీలో చేరారు.మాజీ ఎమ్మెల్యే దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ సమక్షంలో చేరిన జనసేన పార్టీకి చెందిన వారందరికీ వైఎస్ఆర్సిపి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ ప్రశ్నిస్తానని చంద్రబాబుతో జతకట్టిన పవన్ కళ్యాణ్ కు రోజు రోజుకి చుక్కెదరవుతుందన్నారు.ఆయన గ్రాఫ్ దిగజారిపోతున్న ఇప్పటికీ చంద్రబాబు బందీ లోనే ఉన్నాడని ఆరోపించారు.కనీసం పవన్ కళ్యాణ్ తో నడిచిన నేతలకు గానీ కార్యకర్తలకు గానీ ఎ లటువంటి భరోసా కల్పించలేకపోయాడన్నారు.చివరికి వారి ఉన్న ప్రాంతాన్ని కూడా వారు ఏమీ చేయలేకపోతున్నాం అన్న బాధతో మళ్ళీ అభివృద్ధి సంక్షేమం కోసం వైఎస్సార్సీపీలోకి చేరారన్నారు.నేడు పార్టీలో జాయిన్ అయినా కోడిపందాలు వీధికి చెందిన వారి ప్రాంతంలో ద్విచక్ర వాహనం వెళ్లడానికి కూడా కష్టంగా ఉండేది అన్నారు.వాసుపల్లి హయంలోనే వారి ప్రాంతంలో రోడ్లను విస్తరించి నేడు అంబులెన్సులు కూడా వెళ్లే మార్గాన్ని కల్పించానని గుర్తు చేశారు.జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో దక్షిణ నియోజకవర్గ అభివృద్ధి జరిగిందన్నారు.మళ్లీ అటువంటి అభివృద్ధిని కోరుకుని వైయస్ఆర్సీపీకి తిరిగి చేరుతున్నారని వాసుపల్లి స్పష్టం చేశారు.ఇక ఓటు వేసిన యువతకు, మహిళలకు, అన్ని వర్గాల ప్రజలకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలతో మోసం చేశారని వాసుపల్లి ధ్వజమెత్తారు. చివరికి ప్రజలకు కష్టం వచ్చినా కనిపించని నేతలను గెలిపించుకున్నందుకు ప్రజలు సిగ్గు పడుతున్నారన్నారు. చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ లకు జనాలు చీకొట్టే రోజులు దగ్గర పడ్డాయన్నారు.సనాతన ధర్మం పేరిట కుల మతాలను వారిగా విడగొట్టి ప్రజలను రెచ్చగొట్టడం సరికాదన్నారు.ఇప్పటికైనా ప్రజలకు ఇచ్చిన హామీలు, సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. వైయస్సార్సీపి అధికారంలోకి వస్తేనే ప్రజలకు మంచి రోజులు వస్తాయని వాసుపల్లి అన్నారు. జగన్మోహన్ రెడ్డి పేరు,ఆయనపై ప్రజలు చూపుతున్న అభిమానాన్ని చూసి తట్టుకోలేక తప్పుడు కేసులు బనాయించి చంద్రబాబు చేస్తున్న కుతంత్ర రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు.ఈ కార్యక్రమంలో స్టేట్ ఆర్టిఐ ప్రెసిడెంట్ దశమంతులు చిన్ని,స్టేట్ బీసీ సెల్ సెక్రటరీ లండ రమణ,జిల్లా ఆర్టిఏ ప్రెసిడెంట్ వడ్డది దిలీప్ ,జిల్లా మహిళా విభాగం నాయాకులు దశమంతులు రామలక్ష్మి, జిల్లా SC సెల్  ఉపాధ్యక్షులు కోనశంకర్, సౌత్ యూత్ ప్రెసిడెంట్ తాడి రవితేజ, సౌత్ అనుబంధ సంఘాల  ప్రెసిడెంట్ సువార్త రాజు,లీలా కృష్ణ,వాసుపల్లి బంగారమ్మ,ఆకుల శ్యామ్,వి.టి. కృష్ణ,సూరిని రాము, ముత్తబత్తుల రమేష్,ఏరినమ్మ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *