దారి పోడుగునా బ్రహ్మరథం……… రాష్ట్రంలో కూటమిపాలన రావడంతోపాటు శ్రీకాళహస్తిలో తన భర్త బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి విజయం సాధించాలని ఏడుకొండల వెంకటేశ్వరునికి మొక్కుకున్నారు. ఆపదమొక్కులవాడు అనుగ్రహించాడు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యేగా బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి అఖండ మెజారిటీతో విజయం సాధించారు. రెండేళ్ల ప్రజా రంజక పాలన పూర్తి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆ కలియుగ దైవం శ్రీ ఏడుకొండలవానికి మొక్కులు చెల్లించుకోవడం కోసం శనివారం ఉదయం 04.గంటలకు స్వగ్రామం ఊరందూరు నుంచి కాలినడకన పాదయాత్రగా తిరుమలకు బయలుదేరారు. ఆమె వెంట టిడిపి నాయకులు, తెలుగు మహిళలు పాదయాత్రగా బయలుదేరారు. దారి పొడవునా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, మహిళలు ఆమెకు స్వాగతం పలుకుతూ బ్రహ్మారథం పడుతున్నారు.ఈ కార్యక్రమంలో ఏర్పేడు మండల టిడిపి బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి బొడుగు ముని రాజా యాదవ్, పార్లమెంటు కార్యదర్శి గాలి కృష్ణవేణి, యూనిట్ ఇన్చార్జులు కేసినేని సుబ్రమణ్యం రాయపనేని రవి నాయుడు మండల టిడిపి నాయకులు రాచేటి సుబ్రమణ్యం, కే కే రమణ, గుణ యాదవ్, మునెయ్య తదితరులు పాల్గొన్నారు.
