మన ధ్యాస ,కామారెడ్డి: పట్లోళ్ల కిషోర్ కుమార్ రెడ్ క్రాస్ సంస్థలో ప్యాట్రన్ మెంబర్‌గా చేరారు.ఆశిష్ సాంగ్వాన్ పిలుపు మేరకు రూ.25,000 చెల్లించి నిజాంసాగర్ మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన కిషోర్ కుమార్ రెడ్ క్రాస్ ప్యాట్రన్ మెంబర్‌గా సభ్యత్వం స్వీకరించారు. జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ చేతుల మీదుగా సభ్యత్వ పత్రాన్ని అందుకున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..కిషోర్ కుమార్ విద్యా, ధార్మిక రంగాల్లో అందిస్తున్న సేవలను అభినందించారు.సమాజ సేవకు రెడ్ క్రాస్ ఒక గొప్ప వేదికగా నిలుస్తోందని, మరిన్ని సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని సూచించారు.జిల్లాలో స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రెడ్ క్రాస్ సభ్యత్వం తీసుకుంటున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులను కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. అలాగే వారిని ప్రోత్సహిస్తున్న పీఆర్టీయూ సంఘ నాయకత్వాన్ని ప్రశంసించారు.జిల్లాలోని ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రెడ్ క్రాస్ సభ్యత్వం తీసుకొని మానవతా సేవలో భాగస్వాములు కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎన్.వై. గిరి, డా.శశికుమార్,పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు అల్లాపూర్ కుశాల్,ప్రధాన కార్యదర్శి పుట్ట శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు