ఏర్పేడు, జూన్ 09:

చారిత్రాత్మక పుణ్యక్షేత్రమైన ఏర్పేడు మండలం గుడిమల్లం గ్రామంలోని శ్రీ పరశురామేశ్వర స్వామి వారిని ఆలయ చైర్మన్ బత్తల గిరి నాయుడు, ఏర్పేడు మండల తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధ్యక్షులు పేరం నాగరాజు నాయుడు ఈరోజు దర్శించుకున్నారు.

​స్వామి వారి దర్శనార్థం ఆలయానికి చేరుకున్న వీరికి ఆలయ అర్చకులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం అర్చకులు వారికి వేద ఆశీర్వచనం అందించి, స్వామి వారి తీర్థప్రసాదాలను అందజేశారు.

​ఈ కార్యక్రమంలో వారితో పాటు ప్రముఖ నాయకులు నరేంద్ర, వై. మనోహర్ నాయుడు, చలపతి, పద్మనాభ నాయుడు మరియు ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు స్వామి వారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు. దర్శనానంతరం ఆలయ పరిసరాలను పరిశీలించి, భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *