రేణిగుంట జూన్ 4.
ఈరోడ్ రైల్వే స్టేషన్లో తిరుపతికి చెందిన రాజా అనే వ్యక్తి అదృశ్యమైనట్లు జి.ఆర్.పి (రైల్వే) పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం… రాజా మే నెల 13వ తేదీ తెల్లవారుజామున ఒంటిగంట ప్రాంతం నుండి కనిపించకుండా పోయాడు. ఇతనికి డిమెన్షియా (మరపు) వ్యాధి ఉందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సదరు వ్యక్తి చివరిసారిగా ఈరోడ్ రైల్వే స్టేషన్లో ఒక రైలు వెనుక భాగంలో ఉన్న జనరల్ బోగీలోకి ఎక్కుతూ కనిపించాడని రైల్వే పోలీసులు నిర్ధారించారు. ఆయన డార్క్ గ్రే కలర్ ట్రాక్ ప్యాంట్, నేవీ బ్లూ కలర్ టీ షర్ట్ ధరించి ఉన్నాడు. తమిళం, ఇంగ్లీష్, హిందీ, మరాఠీ, మలయాళం భాషలు మాట్లాడగలడు.
ఈ అదృశ్యం ఘటనపై జి.ఆర్.పి పోలీసులు 76/2026 నెంబరుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ వ్యక్తి వివరాలు లేదా ఆచూకీ ఎవరికైనా తెలిస్తే వెంటనే ఈరోడ్ పోలీస్ ఇన్స్పెక్టర్ మొబైల్ నెంబర్: 9943839758 కు ఫోన్ చేసి సమాచారం అందించాలని పోలీసులు మరియు ఫ్యామిలీ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు.
