యాదమరి మే 23 మనద్యాస
ఆహారమే ఔషధం వంటసాలే ఔషధశాల ఈ మాట నేను ఎప్పుడూ చెబుతాను, మనం తినే ఆహారమే మనకు తిరుగులేని ఆరోగ్యాన్ని అందిస్తుంది అని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటించారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం, యాదమరి మండలం కండ్రిగలో శనివారం నిర్వహించిన “సంజీవని” కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రజల ఆరోగ్యానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను వివరించారు. తన వరకు తాను పూర్తి ఆహార నియమాలు పాటిస్తానని, మంచి అలవాట్లు, మంచి ఆహారం, వ్యాయామం, మంచి ఆలోచన ద్వారా ప్రతి ఒక్కరు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. యోగా, ధ్యానం, ప్రాణాయామం వంటివి జీవన శైలిలో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. సంపద ఉన్నవాళ్లకంటే ఆరోగ్యంగా ఉన్నవాళ్లే అదృష్టవంతులని ఉద్గాటించారు. ఈ సందర్భంగా సంజీవని కార్యక్రమం ప్రాముఖ్యతను సీఎం వివరించారు. అనంతరం సంజీవని గురించి రామాయణంలో ఉంది యుద్ధంలో లక్ష్మణుడు మూర్చపోయాడు, ఏమి చేయాలో తెలియని పరిస్థితుల్లో రాముడు ఆంజనేయస్వామిని అడిగితే ఆంజనేయస్వామి ద్రోణగిరి పర్వతాన్ని తీసుకొచ్చి సంజీవని ఔషధంతో లక్ష్మణుని బ్రతికించాడు. హనుమంతుడు ద్రోణగిరి పర్వతాన్ని తీసుకొని వెళుతుంటే, అందులో కొంత భాగం విరిగి ఇదే నియోజకవర్గంలో అర్థగిరిలో పడింది. అలాంటి అర్ధగిరిలో నీటిని తాగితే మీ అందరి ఆరోగ్యం బాగుంటుంది. ఇది నమ్మకం, మహిమ, అని తెలిపారు. రామ రావణ యుద్ధంలో లక్ష్మణుడి ప్రాణాలు కాపాడేందుకు హనుమంతుడు సంజీవని తీసుకొచ్చారు. అదే స్ఫూర్తితో డిజిటల్ హెల్త్ రికార్డులతో ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఈ కార్యక్రమానికి సంజీవని అనే పేరు పెట్టడం జరిగిందని తెలిపారు. అనంతరం సంపద కంటే ఆరోగ్యమే గొప్పది అందుకే ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దలు అన్నారు. అని చంద్రబాబు పేర్కొన్నారు. వ్యాధులు రాకముందే గుర్తించి నివారించేందుకు ప్రెడిక్టివ్,ప్రివెంటివ్, విధానంలో ఈ ప్రాజెక్టును రూపొందించినట్లు తెలిపారు. గత జూలైలో కుప్పంలో పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించి మార్చి 15 నుంచి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా అమలు చేస్తున్నట్లు చెప్పారు. జిల్లాలోని 19.75 లక్షల మంది ఆరోగ్యాన్ని కాపాడేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం ఆగస్టు 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈ ప్రాజెక్టును ప్రారంభిస్తామని ప్రకటించారు. ఈ పథకంలో భాగంగా 42 రకాల వైద్య పరీక్షలను ప్రజల ఇళ్ల వద్దే నిర్వహించి రిపోర్టులు అందిస్తామన్నారు. డాక్టర్ అపాయింట్మెంట్, వర్చువల్ కనెక్ట్ ద్వారా వైద్య సలహాలు వ్యక్తిగత ఆరోగ్య రికార్డుల డిజిటలైజేషన్ వంటి సేవలు అందిస్తున్నట్లు వివరించారు. త్వరలోనే ఏఐ డాక్టర్ ద్వారా కూడా వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రతి వ్యక్తికి ఒక ఏఐ డాక్టర్ ఉంటారని స్పష్టం చేశారు. వైద్య ఖర్చుల భారం నుంచి కుటుంబాలను గట్టి ఎక్కించడమే ప్రభుత్వ లక్ష్యమని విద్య వైద్య రంగాలకు ప్రజా ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ ఏడాది వైద్య రంగానికి రూ.19,305 కోట్లు కేటాయించామని 15వ ఆర్థిక సంఘం నుంచి దేశంలోనే అత్యధికంగా రూ.2,601 కోట్ల ఆరోగ్య గ్రాంట్లు సాధించామని గుర్తు చేశారు యూనివర్సల్ హెల్త్ పాలసీ కింద ప్రతి ఒక్కరికి 2.5 లక్షల విలువైన వైద్యం, ఎన్టీఆర్ వైద్య సేవ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రూ. 25 లక్షల వరకు ఖర్చులు భరిస్తామని హామీ ఇచ్చారు. ప్రకృతి బాగుంటేనే మనం బాగుంటామని పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతని సీఎం అన్నారు.సమర్థ నీటి నిర్వహణతో భూగర్భ జలాలను పెంచగలిగామని దీనికి అన్నమయ్య జిల్లాలో నిదర్శనమని చెప్పారు. ప్రభుత్వ యంత్రాంగం చర్యలతో అక్కడ భోగభాజలాలు 8.5 మీటర్ల పెరిగి పచ్చదనం పెరిగిందన్నారు. రాష్ట్రమంతా తీవ్ర ఉష్ణోగ్రతలు ఉంటే అన్నమయ్య జిల్లాలో ఉష్ణోగ్రత తగ్గుతాయని పిడుగురాళ్లలో 49 డిగ్రీలు నమోదు అయితే అన్నమయ్యలో 40 డిగ్రీలే ఉందని తెలిపారు. సాగునుటి ప్రాజెక్టులపై సంకల్పంతో పనిచేస్తున్నామని ఏ ప్రాజెక్టు ఎప్పుడు పూర్తి చేస్తామో క్యాలెండర్ విడుదల చేశామని చంద్రబాబు తెలిపారు. నీవా పనులు పూర్తిచేసి పూతలపట్టు మీదుగా చిత్తూరు వరకు కృష్ణ నీటిని తెస్తామని కళ్యాణి డ్యాంకు కూడా నీళ్లు ఇస్తామని హామీ ఇచ్చారు. గాలేరు నగరి మల్లెమడుగు సోమశిల స్వర్ణముఖి లింక్ కెనాల్ వంటి ప్రాజెక్టుల పూర్తికి గడువులను ప్రకటించారు ప్రజల భవిష్యత్తుకు భరోసా ఇవ్వడమే తమ లక్ష్యం అని ఆ దిశగా నిరంతరం పనిచేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్, పార్లమెంటు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.