మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ )
మహమ్మద్‌నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామ శివారులో కామరాజు కుంట వద్ద కొనసాగుతున్న ఉపాధి హామీ పనులను ఏపీవో శివకుమార్ పరిశీలించారు. పనుల పురోగతి, కూలీల హాజరు వివరాలను స్వయంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున కూలీలు ఉదయాన్నే పనులకు వచ్చి త్వరగా పనులు ముగించుకుని ఇంటికి వెళ్లాలని సూచించారు. కూలీలకు తాగునీటి సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు.
ఉమ్మడి మండల పరిధిలో సుమారు మూడు వేల మంది కూలీలు ఉపాధి హామీ పనుల్లో పాల్గొంటున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఉపాధి అవకాశాలను గ్రామీణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

By RAHEEM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *