రేణిగుంట మే 20.
‘కార్యకర్తే అధినేత’ అని తెలుగుదేశం పార్టీ అధినేత, సియం చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలు వేదంలా భావించి, ఆచరణలో చేసి చూపుతున్న శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి కార్యకర్తల పక్షపాతి అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మరియు విశ్వబ్రాహ్మణ సంక్షేమం మరియు అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ డా.జి.దశరథాచారి కొనియాడారు.
తెలుగుదేశం పార్టీ వీరాభిమాని, శ్రీకాళహస్తి పరిసర ప్రాంతాలలో ఉన్న ప్రతీ ఒక్కరి నోట్లో నాలుకలా ఉంటూ, అటు తెలుగుదేశం పార్టీ బలోపేతానికి, ఇటు శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి నాయకత్వ పటిష్ఠత కొరకు నిత్యం శ్రమించే పసుపు దళ సైనికుడు, అకుంఠిత దీక్షాపరుడు, శ్రీకాళహస్తి పట్టణ కార్యనిర్వాహక కార్యదర్శి వజ్రం కిషోర్ జన్మదిన సందర్భంగా ఈరోజు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో కిషోర్ చేత కేక్ కట్ చేయించి, శుభాకాంక్షలు తెలియజేశారు.
అదేవిధంగా మరో రెండు రోజుల్లో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని వారికి కూడా ముందస్తుగా శుభాకాంక్షలు తెలియజేసి, వారికి శుభాభినందనలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 22న తన పుట్టినరోజు సందర్భంగా ప్రజలందరి ప్రేమ, ఆశీస్సులు నాకు ఎల్లప్పుడూ ఉండాలని, అయితే… ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు మరియు పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకొని అనవసరపు ఖర్చులతో ఫ్లెక్సీ హోర్డింగ్స్, టపాసులు వంటి కార్యక్రమాలకు దూరంగా ఉండాలని మనస్పూర్తిగా కోరారు.
ఒక ప్రజాప్రతినిధిగా ప్రజల అభిమానం తనకు ఎంతో విలువైనదని, ఆ అభిమానాన్ని కేక్ కటింగ్ లేదా భారీ వేడుకల రూపంలో కాకుండా, రక్తదాన శిబిరాలు లేదా పేదలకు అన్నదానం వంటి సేవా కార్యక్రమాల ద్వారా చూపిస్తే అది నాకు ఎంతో సంతృప్తినిస్తుందని, కాబట్టి మీ అందరి సహకారం, ఆశీస్సులు నాపై ఎళ్ళవేళలా ఉండాలని ఆశిస్తున్నానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు డా.జి.దశరథాచారి, మిన్నల్ రవి, కామేష్ యాదవ్, డా. యం.ఉమేష్ రావు, యం.సుబ్బయ్య, వజ్రం కిషోర్, కన్నలి మోహన్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *