మన న్యూస్:పాచిపెంట,డిసెంబర్ 16పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో 19 సంవత్సరాల క్రితం పెద్ద గెడ్డ జలాశయం నిర్మాణం కోసం సర్వస్వం కోల్పోయిన మా పంచాయతీ ప్రజలకు న్యాయం చేయాలని కోటికి పెంట సర్పంచ్ ఇజ్జాడ అప్పలనాయుడు పార్వతిపురం గ్రీవెన్స్లలో అధికారులను కోరారు. సోమవారం నాడు ఆయన కొంతమంది నిర్వాసితులతో కలిసి వారి సమస్యలపై జాయింట్ కలెక్టర్ కు మెమోరాండం అందించారు.2005 సంవత్సరంలో జలాశయం నిర్మాణంలో భూములు కోల్పోయామని దాని నిమిత్తం మాకు వేరే దగ్గర 18ఎకరాలు స్థలము ఇల్లులు నిర్మాణం కోసం చూపించారని,కానీ ఇంతవరకు వాటిలో వసతి సౌకర్యాలు ఏర్పాటు చేయలేదని ఆయన అధికారులకు తెలియజేశారు.19 ఏళ్ల క్రితం నుంచి తాము నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ప్రభుత్వాలు మారినా మా సమస్యలు తీరలేదని మా సమస్యలు తీరాలంటే మీరు స్పందించి తగు న్యాయం చేయాలని కోరారు.ఇల్లులు నిర్మించే స్థలం వద్ద వెంటనే మంచినీటి సౌకర్యము, పాఠశాల భవన నిర్మాణము, రహదారులు నిర్మాణం చేపట్టాలని కోరారు.గ్రీన్ ఫీల్డ్ రహదారి నిర్మాణం తో పలువురు గిరిజనులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెంటనే విచారణ జరిపించి పరిష్కార మార్గం చూపాలని ఆయన జిల్లాజాయింట్ కలెక్టర్,మిగతా అధికారులను కోరారు.వీరి దరఖాస్తు పై జాయింట్ కలెక్టర్ స్పందించి సమంత అధికారులతో విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారు.నిర్వాసిత స్థలంలో విద్యుత్ సౌకర్యం కల్పించాలని ఆ గ్రామంలో కలుసిత నీరు త్రాగి చాలామంది ఇబ్బంది పడుతున్నారు.వారి బాధను వ్యక్తం చేశారు.ఈ సమస్య కూడా పరిశీలించి తగు న్యాయం చేస్తామని జాయింట్ కలెక్టర్ హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *