తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ నూతన కార్యాలయ నిర్మాణ పనులను తుడా ఛైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాలర్స్ దివాకర్ రెడ్డి ఈరోజు క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి కార్యాలయ ప్రాంగణమంతా కలియ తిరిగి,పార్టీ శ్రేణులకు అన్ని విధాలా అందుబాటులో ఉండేలా, అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ నూతన కార్యాలయ పనుల పురోగతిని సమీక్షించారు.

