*నిర్దేశిత గడువులోగా నాణ్యమైన ప్రమాణాలతో పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు ఆదేశం..
తిరుపతి మే 16.
తిరుపతి నగర ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు తీర్చడమే ధ్యేయంగా తుడా ఆధ్వర్యంలో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, నిర్దేశిత గడువులోగా పనులను పూర్తి చేయాలని తుడా ఛైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాలర్స్ దివాకర్ రెడ్డి స్పష్టం చేశారు.ఉప్పరపల్లి పరిధిలో జరుగుతున్న ప్రధాన రోడ్డు విస్తరణ,డ్రైనేజీ నిర్మాణ పనులను ఆయన తుడా అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల ప్రగతిని అడిగి తెలుసుకున్న ఆయన, కాంట్రాక్టర్‌కు మరియు ఇంజనీరింగ్ అధికారులకు పలు కీలక సూచనలు, సలహాలు ఇచ్చారు.ఉప్పరపల్లి రోడ్డు అత్యంత రద్దీగా ఉండే ప్రాంతం కాబట్టి, పనుల వల్ల స్థానిక ప్రజలకు, వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా బారికేడ్లు,సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు.ఉప్పరపల్లి రోడ్డు విస్తరణ ఈ ప్రాంత ప్రజల దశాబ్దాల కల అని,పనులను వేగవంతం చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో తుడా సెక్రటరీ డా యన్ వి శ్రీకాంత్ బాబు,ఇంజనీరింగ్ అధికారులు,మరియు కాంట్రాక్ట్ ప్రతినిధులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *