చీకటి నుంచి వెలుగులోకి గాంధీ విగ్రహం – టిడిపి శ్రీకాళహస్తి మైనారిటీ అధ్యక్షుడు షేక్ అఫ్రోజ్….
రేణిగుంట:
తిరుపతి జిల్లా రేణిగుంట బస్టాండ్ కూడలి వద్ద ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం పట్ల టిడిపి శ్రీకాళహస్తి నియోజకవర్గ మైనారిటీ అధ్యక్షులు షేక్. అఫ్రోజ్ అభినందనీయమైన సామాజిక స్పృహను చాటుకున్నారు.
రేణిగుంట బస్టాండ్ సమీపంలోని గాంధీ మండపములో విద్యుత్ దీపాలు లేకపోవడం వల్ల రాత్రి వేళల్లో జాతిపిత విగ్రహం చీకటిలో ఉండటం, అలాగే విగ్రహానికి ఉండాల్సిన కళ్ళజోడు లేకపోవడాన్ని అఫ్రోజ్ గమనించారు. ఈ పరిస్థితిని చూసి మనస్తాపానికి గురైన ఆయన, తక్షణమే స్పందించి తన సొంత చొరవతో విగ్రహ పునరుద్ధరణ పనులు చేపట్టారు.
మండపమునకు నూతనంగా విద్యుత్ దీపాలను (లైట్లు) ఏర్పాటు చేయించి వెలుగులు నింపడమే కాకుండా, గాంధీజీ విగ్రహానికి కొత్త కళ్ళజోడును కూడా అమర్చారు.
ఈ సందర్భంగా షేక్ అఫ్రోజ్ మాట్లాడుతూ: “గాంధీ విగ్రహం చీకటిలో ఉండటం, కళ్ళజోడు లేకపోవడం చూసి మనసు బాధపడింది. వెంటనే మండపానికి లైట్లు వేయించి, కళ్ళజోడును అమర్చడం జరిగింది. ఇప్పుడు ఆ మహనీయుని విగ్రహం వెలుగులతో, కళకళలాడుతూ కనిపిస్తుంటే నా మనసుకి ఎంతో తృప్తిగా, సంతోషంగా ఉంది” అని పేర్కొన్నారు.
మహనీయుల విగ్రహాలను, స్మారక చిహ్నాలను గౌరవప్రదంగా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని ఆయన గుర్తు చేశారు. షేక్ అఫ్రోజ్ చేసిన ఈ సత్కార్యాన్ని స్థానికులు మరియు ప్రయాణికులు సాదరంగా అభినందిస్తున్నారు.
