సీతారామపురం టిడిపి మాజీ మండల అధ్యక్షులు ముత్తంశెట్టి చెన్నకేశవులు కుమారుడు రవిచంద్ర వివాహా కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు బొల్లినేని వెంకట రామారావు..
సీతారాంపురం, మే 07, ఎల్లో సింగం ప్రతినిధి నాగరాజు.

సీతారాంపురం మండలం బాలాయపల్లిలో టిడిపి మాజీ మండల అధ్యక్షులు ముత్తంశెట్టి చెన్నకేశవులు కుమారుడు చి॥ రవిచంద్ర వివాహ మహోత్సవ రిసెప్షన్ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి టిడిపి జాతీయ ఉపాధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు బొల్లినేని వెంకట రామారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా బొల్లినేని వెంకట రామారావు నూతన వధూవరులను ఆశీర్వదించి, వారి దాంపత్య జీవితం ఆనందంగా, ఆయురారోగ్యాలతో సాగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో స్థానిక టిడిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
