మన ధ్యాస, నిజాంసాగర్,( జుక్కల్ ) మే 6:నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట్ గ్రామంలో పావురాల ఎల్లమ్మ జాతర సందర్భంగా బుధవారం కుస్తీ పోటీలు ఉత్సాహంగా నిర్వహించారు. ఉదయం రూ.100, రూ.200, రూ.500 నగదు బహుమతులతో కుస్తీ పోటీలు ప్రారంభమయ్యాయి.
మహిళా మల్లయోధులు రంగంలోకి దిగినప్పుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. శక్తి, పట్టుదలతో పోటీ పడుతూ తమ ప్రతిభను ప్రదర్శించారు. ప్రతి పట్టులోనూ చూపిన నైపుణ్యం ప్రేక్షకులను ఆకట్టుకుంది.చిన్నారుల నుంచి పెద్దల వరకు పోటీల్లో పాల్గొనడం విశేషం. గ్రామీణ ప్రాంతంలో మహిళలు ధైర్యంగా కుస్తీ పోటీల్లో పాల్గొనడాన్ని జహీరాబాద్, నారాయణ ఖేడ్,బీదర్, కర్ణాటక లనుంచి తరలివచ్చారు.చివరి పోటీల్లో విజేతలకు రూ.3,500 నగదు బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ నిర్వాహకులు బంగ్లా ప్రవీణ్ కుమార్, సర్పంచ్ సంకు లక్ష్మయ్య, నాయకులు మంద బలరాం తదితరులు పాల్గొన్నారు. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

By RAHEEM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *