- ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర మహోత్సవాలను పురస్కరించుకుని తుడా ఛైర్మన్, తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాలర్స్ దివాకర్ రెడ్డి ని గంగమ్మ దేవస్థానం ఛైర్మన్ మహేష్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు.
- ఈ సందర్భంగా మహేష్ యాదవ్ జాతర ఆహ్వాన పత్రికను అందజేసి, అమ్మవారి జాతర విశిష్టతను వివరించారు.
- నెలలో అత్యంత వైభవంగా జరగనున్న ఈ జాతర మహోత్సవానికి విచ్చేసి, అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు.
- తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి ఈ ఆహ్వానాన్ని సంతోషంగా స్వీకరిస్తూ, జాతర ఏర్పాట్లపై ఆరా తీశారు.
- తిరుపతి ప్రజల ఆరాధ్య దైవమైన గంగమ్మ తల్లి జాతరను ఘనంగా నిర్వహించేందుకు తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.
- ఈ కార్యక్రమంలో తుడా సెక్రటరీ డా యన్ వి శ్రీకాంత్ బాబు, సీపిఓ దేవికుమారి,దేవస్థాన పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు.


