మన ధ్యాస ప్రతినిధి విశాఖపట్నం(పీఎం పాలెం):పదో తరగతి ఫలితాల నేపథ్యంలో విద్యార్థులు తల్లి దండ్రులు సంయమనం పాటించాలని పీఎం పాలెం సీఐ జి.బాలకృష్ణ ఒక ప్రకటనలో కోరారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్షల్లో విజయాపజయాలు సహజమని మార్కులు తక్కువ వచ్చినా ఫెయిల్ అయినా విద్యార్థులు ప్రాణాలు తీసుకోవడం వంటి అనాలోచిత నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు.ఫెయిల్ అయిన పిల్లలను మందలించకుండా,వారికి అండగా నిలవాలని మానసిక ధైర్యాన్ని నూరి పోయాలని కోరారు ఒక్క సారి విఫలమైనంత మాత్రాన జీవితం ముగిసిపోదని కష్టపడితే అడ్వాన్స్ సప్ల మెంటరీ లో విజయం సాధించవచ్చని తెలిపారు.ఎవరైనా విద్యార్థులు తీవ్ర మనస్తాపానికి గురైతే,వారిని తన వద్దకు తీసుకురావాలని తానే స్వయంగా వారికి కౌన్సెలింగ్ ఇస్తానని సీఐ భరోసా ఇచ్చారు.అమూల్య మైన జీవితాన్ని చిన్న చిన్న కారణాలతో పాడుచేసుకో వద్దని ఆయన విద్యార్థులకు హితవు పలికారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *