మన ధ్యాస ,నిజాంసాగర్ (జుక్కల్), ఏప్రిల్ 29:
ప్రభుత్వ ఉద్యోగుల జీవితంలో పదవీ విరమణ ఒక సహజమైన ఘట్టమని ఎంపీడీఓ దంతాల శివకృష్ణ అన్నారు. బుధవారం నిజాంసాగర్ ఎంపీడీఓ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా సేవలందించిన తురబుల్ హక్ పదవీ విరమణ పొందిన సందర్భంగా ఆత్మీయ వీడ్కోలు సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ..తురబుల్ హక్ నిజాంసాగర్ మండలంలో ఏడు సంవత్సరాల పాటు క్రమశిక్షణతో, అంకితభావంతో విధులు నిర్వహించి అందరి అభిమానం సంపాదించుకున్నారని కొనియాడారు.కార్యాలయ పనుల్లో ఆయన చూపిన నిబద్ధత సహోద్యోగులకు ఆదర్శంగా నిలిచిందన్నారు.అనంతరం తురబుల్ హక్‌ను శాలువాతో సత్కరించి, పూలమాల వేసి ఘనంగా అభినందించారు. జ్ఞాపికను అందజేసి, పదవీ విరమణ అనంతరం ఆయురారోగ్యాలతో ఆనందంగా జీవించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి అనితారెడ్డి,పర్యవేక్షకులు గంగాధర్, పంచాయతీ కార్యదర్శులు గంగాసాగర్,మతిన్,ప్రాణీత్, రమ్యశ్రీ,భారతి,తదితరులు ఉన్నారు.