మన ధ్యాస ,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండల కేంద్రంలో పోతులూరి వీరభ్రహ్మేంద్ర స్వామి ఉత్సవాల్లో భాగంగా సోమవారం నిర్వహించిన కుస్తీ పోటీలు ఆకట్టుకున్నాయి. గ్రామ సర్పంచ్ సుగణమ్మ కొబ్బరికాయ కొట్టి కుస్తీ పోటీలను ప్రారంభించారు. రూ. పదితో ప్రారంభమైన పోటీలు రూ. వెయ్యి వరకు కొనసాగాయి. కుస్తీ పోటీలలో పాల్గొనేందుకు కర్ణాటక, జహీరాబాద్, నారాయణఖేడ్ సంగారెడ్డి, మెదక్, మహారాష్ట్ర ప్రాంతాలకు చెందిన మల్లయోధులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పోటీల్లో పాల్గొన్నారు. చివరగా గెలుపొందిన కుస్తీ పోటీ విజేతకు ఐదు తులాల వెండి కడియాన్ని డీసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ చేతుల మీదుగా అందజేశారు. గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ నిర్వాహకులు పాల్గొన్నారు.

By RAHEEM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *