తవణంపల్లి ఏప్రిల్ 27 మన ధ్యాస
చిత్తూరు జిల్లా ఎస్పీ ఆదేశాలు మేరకు తవణంపల్లి పోలీస్ స్టేషన్ నందు ఈరోజు ఉదయం 09.40 గంటలకు ఎస్సై జి . రమేష్ బాబు పదవి బాధ్యతలు స్వీకరించారు . మండలములో శాంతి భద్రతలను కాపాడుతూ, పోలీస్ స్టేషన్ కి వచ్చే భాదితులకు త్వరగా న్యాయం జరిగేలా చూస్తానని మరియు ఎలాంటి అసాoఘిక కార్యక్రమాలు జరుగకుండా విధులు నిర్వహిస్తానని, దళారులను నమ్మవద్దని చెప్పారు