మణుగూరు ఏరియా ఓసి -2 ఆపరేటర్ల ఔదార్యం అనారోగ్యంతో మృతి చెందిన సింగరేణి కార్మికుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

మన న్యూస్: పినపాక నియోజకవర్గం, సింగరేణి కాలరీస్ మణుగూరు ఏరియా ఓసి-2 ఏ రిలే ఆపరేటర్ల ఆధ్వర్యంలో తమ షిఫ్ట్ లోనే పంపు ఆపరేటర్ గా పనిచేస్తూ ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన పీ వి కాలనీ వాసి రుద్రాక్షల కృష్ణ కుటుంబానికి ఆదివారం నాడు పీవీ కాలనీలో వారి నివాస గృహానికి చేరుకుని ఏ రిలే షిఫ్ట్ ఇన్ చార్జ్ ఎం నరసింహారావు చేతుల మీదుగా డబ్బయి మూడు వేల ఐదువందల రూపాయల ఆర్థిక సహాయం అందజేసి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిధి మాట్లాడుతూ ఆపదలో ఉన్న తమ తోటి ఉద్యోగి కుటుంబానికి ఆర్థికంగా ఆపన్న హస్తం అందజేసి మేమున్నామంటూ కొండంత మనోధైర్యాన్ని నింపటం ఓదార్పునివ్వడం అభినందనీయమని ఈ సందర్భంగా ఆపరేటర్ల సేవలను ఆయన కొనియాడారు. తమ తోటి ఉద్యోగులే కాకుండా కష్టాల్లో ఉన్న అనేకమందికి అనేక విధాలుగా పలు సందర్భాలలో తోడ్పాటునందించిన ఏ రిలే ఉద్యోగులను ఆయన ప్రశంసించారు. అందరితో ఎంతో స్నేహభావంగా ఉండే కృష్ణ మృతి ఎంతో బాధాకరమని సంతాపం తెలియజేస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అండర్ మేనేజర్ భార్గవ్,ఇంజనీర్ వెంకటరమణ హెడ్ ఓవర్ మెన్ లు సుదీప్, రాజ్ కుమార్, ఏ రిలే ఆపరేటర్ల తరపున ప్రతినిధులుగా సయ్యద్ నయమత్ హుస్సేన్, కె మల్లికార్జునరావు, భాగం రవికుమార్, గిరీష్ రెడ్డి, శ్రీధర్, చెన్నుపాటి హనుమాన్ బాబు,కొత్త సత్యనారాయణ, ఎండి యాకూబ్ పాషా, అన్నం రాజేందర్, సూర్య ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    మహేశ్వరం, మన ధ్యాస: మహేశ్వరం నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో,కేబుల్ ఇంటర్నెట్ ఆపరేటర్లు మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యలను వివరించారు.రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది ఆపరేటర్లు ఈ వృత్తిపై ఆధారపడి…

    హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అధిక లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉండగా,మన ధ్యాస దినపత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.ఇందులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వదిలివేయబడినట్లు, అందువల్ల…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్ చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్  చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

    మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

    అచ్చంనాయుడుది నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

    అచ్చంనాయుడుది  నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

    ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు…….. షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి

    ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు……..  షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా ఆంధ్రప్రదేశ్ సమాచార మరియు ప్రజా సంబంధాల (ఐ అండ్ పి ఆర్) శాఖ డైరెక్టర్ హిమాన్షు శుక్లా