కలిగిరి ఏప్రిల్ 18 మాన న్యూస్ ప్రతినిధి నాగరాజు.
కలిగిరి మండలంలో నాగసముద్రం సెక్టార్ చిన్న అన్నలూరు గ్రామం తూర్పు మాలపాలెం గ్రామంలో శుక్రవారం పోర్షన్ పక్వాడ్ కార్యక్రమాన్నీ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఐసిడిఎస్ సూపర్వైజర్ సుజాత అనంతరం ఆమె మాట్లాడుతూ ఈనెల తొమ్మిదో తేదీ నుండి 23వ తేదీ వరకు ఈ కార్యక్రమాలు జరుగుతాయని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా గర్భవతులు, బాలింతలు, పిల్లలు తల్లులకు జంక్ ఫుడ్ గురించి వివరించడం జరిగింది. పిల్లలకు మొబైల్ ఫోన్ గురించి అదే విధంగా రెండు సంవత్సరంలో పిల్లలు కు బ్రెయిన్ డెవలప్మెంట్ గురించి, అవేర్నేషన్ కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్,ఉమా, లతా, రమాదేవి, దొరసానమ్మ, సరూప రాణి, తదితరులు పాల్గొన్నారు.