తిరుపతి, మన ధ్యాస, ఏప్రిల్ 17: శ్రీ రంగరాజపురం మండలం 49 కొత్తపల్లి మిట్ట గ్రామానికి చెందిన యుగంధర్ రెడ్డిని ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్ఆర్సిపి ప్రచార విభాగం కార్యదర్శిగా నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఈ సందర్భంగా యుగంధర్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ అభివృద్ధికి తాను చేసిన సేవలను గుర్తిస్తూ, తనపై నమ్మకంతో ఈ పదవి బాధ్యతలు అప్పగించినందుకు మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామికి, గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ సమన్వయకర్త కృపా లక్ష్మికి కృతజ్ఞతలు తెలిపారు.గ్రామస్థాయిలో పార్టీ బలపరిచేందుకు మరింత కృషి చేస్తానని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి జెండా ఎగరవేయడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని పిలుపునిచ్చారు.అలాగే గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ సమన్వయకర్త కృపా లక్ష్మిని అఖండ మెజార్టీతో గెలిపించి నాయకత్వానికి కానుకగా అందించాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *