మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) మహమ్మద్ నగర్ మండలంలోని గున్కుల్ గ్రామంలో ఉమ్మడి నిజాంసాగర్ మాజీ ఎంపీపీ వీరంగణ భాయ్ భర్త ఈశ్వర్ పటేల్ మరణంపై డిసిసి అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
మృతుడి కుటుంబ సభ్యులను స్వయంగా కలసి పరామర్శించి,వారికి ధైర్యం చెప్పి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కష్ట సమయంలో కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మహమ్మద్ నగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి, సర్పంచుల ఫోరమ్ అధ్యక్షులు రమేష్,సర్పంచులు హరిన్ కుమార్,కిరణ్,నాయకులు కాశయ్య,ఇఫ్తేకార్,ఆకాష్,అతిక్,సాయ గౌడ్,రామా గౌడ్,తదితరులు ఉన్నారు