కలిగిరి, ఏప్రిల్ 14, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు.
కలిగిరి మండలం కృష్ణారెడ్డి పాలెం గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 13వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా కలిగిరి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పూసాల వెంగపనాయుడు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ,, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాతగా దేశానికి అపూర్వ సేవలు అందించారని ఆయన పేర్కొన్నారు.రాజ్యాంగ నిర్మాణంలో అద్భుత పాత్ర పోషించిన మహా మేధావి దూరదృష్టి గల దార్షినికుడు, ప్రపంచానికి ప్రజాస్వామ్య విలువను అందించిన మహానుభావుడని, ఆయన కొనియాడారు. కుల వివక్ష మూఢనమ్మకాలు వంటి సామాజిక న్యాయాలపై నిరంతరం పోరాడి సమాజంలో సమానత్వం నెలకొల్పడానికి తన జీవితాన్నీ అంకితం చేశారని ఆయన పేర్కొన్నారు. ప్రతి పౌరుడికి సామాజిక న్యాయం అందించాలన్నదే అంబేద్కర్ ప్రధాన అంశమని ఆయన గుర్తు చేశారు. సమాజంలో సమానత్వం న్యాయం స్వేచ్ఛ సాధన కోసం అంబేద్కర్ చేసిన కృషి చిరస్మేరనీయమని ఆయన తెలిపారు. యువత అంబేద్కర్ ఆలోచనలు అనుసరించి సమాజాభివృద్ధికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని నివాళులు అర్పించారు.