శంఖుస్థాపన మహోత్సవంలో పాల్గొన్న టీడీపీ నెల్లూరు జిల్లా పార్లమెంట్ ఉపాధ్యక్షులు బిజ్జం వెంకటకృష్ణరెడ్డి..
పరమశివుని ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని ఆయన ఆకాంక్ష..!

కలిగిరి, ఏప్రిల్ 12, (మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె)

కలిగిరి మండల కేంద్రంలో శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థాన శంఖుస్థాపన మహోత్సవం భక్తి, శ్రద్ధ, ఆధ్యాత్మికతల సమ్మేళనంగా ఘనంగా నిర్వహించబడింది. ఈ పవిత్ర కార్యక్రమానికి నెల్లూరు జిల్లా పార్లమెంట్ ఉపాధ్యక్షులు బిజ్జం వెంకటకృష్ణరెడ్డి విచ్చేసి, స్వామివారికి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అర్చనలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తులతో కళకళలాడుతూ, మంత్రోచ్చారణల నడుమ ఆధ్యాత్మిక వాతావరణం అలుముకుంది. గ్రామస్థులు,కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరై ఈ శుభకార్యాన్ని మరింత వైభవంగా నిలిపారు.ఈ సందర్భంగా బిజ్జం వెంకటకృష్ణరెడ్డి మాట్లాడుతూ, పరమశివుడి కృప కలిగిరి మండలంలోని ప్రతి కుటుంబంపై ఎల్లప్పుడూ నిలిచి ఉండాలని ఆకాంక్షించారు. స్వామివారి దీవెనలతో ప్రజల జీవితాల్లో శాంతి, సౌఖ్యం, ఆనందం నిండాలని, రైతులు పాడిపంటలతో సమృద్ధిగా వర్ధిల్లాలని ఆయన కోరుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *