కుట్టీ రాయల్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పేదలకు అన్నదానం చేసిన అభిమానులు, స్వచ్ఛందంగా రక్త దానం చేసిన అల్లు అర్జున్ అభిమానులు.

చిత్తూరు, మన ధ్యాస,మార్చి 8, రిపోర్టర్ కమల్ రెడ్డి

సినీ నటుడు అల్లు అర్జున్ 44 వ జన్మదిన వేడుకలను చిత్తూరు నగరంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎంఎస్ఆర్ సర్కిల్ లో జిల్లా అల్లు అర్జున్ అభిమాన సంఘం అధ్యక్షులు కుట్టీ రాయల్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి అందరికీ పంచి పెట్టారు. అనంతరం పేదలకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మండీ సుధాకర్ రెడ్డి, జిల్లా ప్రతినిధి శ్రీనివాసమూర్తి హాజరయ్యారు. ఈ సందర్భంగా కుట్టీ రాయల్ మాట్లాడుతూ … ప్రతి ఏటా తమ అభిమాన నటుడు అల్లు అర్జున్ జన్మదిన వేడుకలను అభిమానుల సమక్షంలో ఘనంగా నిర్వహించుకుంటున్నట్లు పేర్కొన్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారి ప్రాణాలను కాపాడేందుకు వీలుగా తమ అభిమాన సంఘం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి బన్నీ అభిమానులందరూ తమ రక్తాన్ని దానం చేశారని వెల్లడించారు. రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా భారతదేశం అంతటా తమ అభిమాన నటుడు అల్లు అర్జున్ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం సంతోషాన్నీ ఇస్తోంది అన్నారు. ముఖ్యంగా ఈ ఏడాది 10 నుంచి 20 సంవత్సరాల లోపు వయసు గల బాలికలకు గర్భాశయ క్యాన్సర్ సోకకుండా ముందస్తుగా వేసే హెచ్పివీ వ్యాక్సిన్ కు తమ అభిమాన నటుడు అల్లు అర్జున్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉండడం గర్వకారణమన్నారు. తాము సైతం తమ అభిమాన నటుడు అల్లు అర్జున్ బాటలో పయనిస్తూ జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో ఉన్న బాలికల పాఠశాలలు, కళాశాలలు, బాలికల వసతి గృహాల్లోని బాలికలకు హెచ్ పీ వీ వ్యాక్సిన్ పట్ల అవగాహన కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. తమ అవగాహన కార్యక్రమాలకు బాలికల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు. తల్లిదండ్రులు కూడా ముందస్తు జాగ్రత్తగా 10 నుంచి 20 సంవత్సరాల లోపు ఉన్న తమ ఆడ పిల్లలకు హెచ్పీవీ వ్యాక్సిన్ ను వేయించాలని ఆయన సూచించారు. కాగా ఈ కార్యక్రమంలో అల్లు అర్జున్ అభిమాన సంఘం నాయకులు అబ్దుల్లా, శివ, ఐకాన్ సురేష్, చంటి సునీల్, లోకేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *