

తవణంపల్లి డిసెంబర్ 14 మన న్యూస్
భారత ప్రభుత్వం చే జిల్లాలోని దివ్యాంగులకు, వయోవృద్ధులకు, సహాయ జీవన పరికరాలు పంపిణీ జిల్లా పరిపాలన యంత్రాంగం వారి సహకారంతో ఉచితంగా ఇవ్వబడుతుందని అరగొండ పంచాయతీ ఈ.ఓ. కె మురుగేషన్, తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఒక ప్రకటనలో తెలుపుతూ తవణంపల్లి మండలంలోని దివ్యాంగులకు, విభిన్న ప్రతిభావంతులకు, వయోవృద్ధులకు, చిత్తూరులోని పి.సి.ఆర్ ప్రభుత్వ పాఠశాల నందు 17వ తేదీ మంగళవారం శిబిరము ఏర్పాటు చేయడం జరిగిందని ఈ శిబిరంలో ఉచిత పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి చేతి కర్రలు, వాకర్లు, మూడు కాళ్ల చేతి కర్రలు, నాలుగు కాళ్ల చేతి కర్రలు, వాకర్స్, చంక కర్రలు, వీల్ చైర్లు, చెవి వినికిడి యంత్రాలు, బ్యాటరీ ట్రై సైకిల్స్, మూడు చక్రాల సైకిళ్లు, రోల్ టేర్స్, ఎం ఎస్ కిడ్స్, అందుల చేతి వాచ్, టచ్ ఫోన్, వాయిస్ ఫోన్, ఎల్బో కచర్స్, కుష్టు వ్యాధిగ్రస్తులకు లేప్రసి కిట్లు, డైసీ ప్లేయర్, ఎం ఎస్ ఐ డి కిడ్స్, స్మార్ట్ కెన్ కృత్రిమ అవయములు, వివిధ రకాల కలిగిన ఉపకరణములు ఇచ్చుటకు భారత ప్రభుత్వం శిబిరములు ఏర్పాటు చేయబడిందని ఈ శిబిరంలో పరీక్షలు నిర్వహించి అర్హులైన వారికి మరొక తేదీని ప్రకటించి పంపిణీ చేయబడుతుందని అరగొండ పంచాయతీ ఈ ఓ. కె మురుగేషన్ తెలిపారు . అవసరం కలిగిన వారు ఈ శిబిరము లో పాల్గొని పరికరాలు ఉచితంగా పొందవచ్చని తెలియజేశారు.