కలిగిరి, మార్చి 15,మన న్యూస్ ప్రతినిధి, నాగరాజు కె.

నెల్లూరు జిల్లా కలిగిరి మండలం
లో సోమవారం మన్యం షావలి మసీదు నందు నెల్లూరు జిల్లా పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ద్వారా కలిగిరి మండలంలోని 11 మసీదులకు కొండాపురం మండలంలోని 12 మసీదులకు సంబంధించి న 46 మంది ఇమామ్ మోజోన్లకు ఆయన ప్రత్యేకంగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ రంజాన్ కానుకను తోఫా అందజేయడం జరిగింది.అనంతరం ముస్లిం సోదరులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అంతేకాకుండా రాబోయే రోజుల్లో మరోసారి ఎంపి గా గెలిపించుకుంటమని వారు తెలియజేసారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా నెల్లూరు జిల్లా టిడిపి మైనార్టీ సెల్ ఉపాధ్యక్షులు షేక్ రఫీ అహ్మద్,నెల్లూరు పార్లమెంటు టీడీపీ ఉపాధ్యక్షులు బిజ్జం వెంకటకృష్ణారెడ్డి, మరియు ఉదయగిరి నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షులు కొండయ్య కలిగిరి మండల టిడిపి మైనార్టీ నాయకులు హటేల్ భాషా, కలిగిరి మసీదు కమిటీ సభ్యులు జిలాని, జమాత్ బాధ్యులు నాయబ్ రసూల్, తదితరులు పాల్గొని కలిగిరి మండల కొండాపురం మండల మసీదులకు సంబంధించిన ఇమామ్ మరియు మోజోన్లకు విపిఆర్ ఫౌండేషన్ ద్వారా రంజాన్ తోఫా అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా మైనార్టీ నాయకులు రఫీ అహ్మద్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *