మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరికలు జోరుగా జరుగుతున్నాయని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు అన్నారు .
మహమ్మద్ నగర్ మండల కేంద్రంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు సమక్షంలో మోతీ రామ గౌడ్ గారు,బుడగజంగం,కాశీరామ్ ,సింగీతం గ్రామానికి చెందిన యువ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు.వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ..
కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, అభివృద్ధి పనుల పట్ల ఆకర్షితులై ఇతర పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరుతుండటం ఎమ్మెల్యే స్వాగతిస్తూ హర్షం వ్యక్తం చేశారు.రాబోయే రోజుల్లో జుక్కల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం అందరూ కలిసి పని చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ మరింత బలపడేందుకు ప్రతీ కార్యకర్త కృషి చేయాలని ఆయన సూచించారు.ఈ కార్యక్రమంలో పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మనోజ్ కుమార్, మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి, ఎస్టి సెల్ ఉపాధ్యక్షులు లోక్య నాయిక్, సర్పంచులు బోయిని హరికుమార్,కుమ్మరి రాములు,కిరణ్,నాయకులు నాగభూషణం గౌడ్,గోట్టం నర్సింలు, కాశయ్య,ఇఫ్తేకార్, సంతోష్ రాథోడ్, ఆకాష్,గోపి సింగ్,గుర్రపు శ్రీనివాస్,తదితరులు ఉన్నారు.

By RAHEEM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *