మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ )
మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను హౌసింగ్ ఏఈ హరిత పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. లబ్ధిదారులు ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని ఇండ్ల నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని సూచించారు.
ఇండ్ల నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని, ఎలాంటి నిర్లక్ష్యం చేయకూడదని ఆమె అన్నారు. ప్రభుత్వం విడుదలవారీగా సకాలంలో ఇందిరమ్మ ఇండ్ల డబ్బులను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్నదని తెలిపారు. పనులు దశలవారీగా పూర్తవుతున్న కొద్దీ తదుపరి విడత నిధులు కూడా విడుదలవుతాయని చెప్పారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ బోయిని హరిన్ కుమార్, పంచాయతీ కార్యదర్శి శిరీష, గ్రామస్థులు,తదితరులు ఉన్నారు.

By RAHEEM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *