మన ధ్యాస,నిజాంసాగర్, ( జుక్కల్ ) నిజాంసాగర్ ,మహమ్మద్ నగర్ మండలాలాల్లో పబ్లిక్ పరీక్షలకు హాజరుకాబోతున్న ఎస్ ఎస్ సి విద్యార్థులకు ఉత్సాహం కలిగించే విధంగా మన కోసం మనం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సుమారు 400 మంది విద్యార్థులకు నిజాంసాగర్ మండలంలోని అచ్చం పేట్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పెన్స్,ప్యాడ్లు లను రాష్ట్ర అధ్యక్షులు దామోదర్ రెడ్డి,కామారెడ్డి జిల్లా అధ్యక్షులు కుషాల్,మన కోసం మనం సంస్థ వ్యవస్థాపకులు పట్లోళ్ల కిషోర్ లు కలిసి విద్యార్థులు లకు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు దామోదర్ రెడ్డి మాట్లాడుతూ ..మన కోసం మనం అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి సమాజానికి ఉపయోగపడే అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న పట్లోళ్ల కిషోర్ గొప్ప మనసు ఉన్న వ్యక్తి అని ప్రశంసించారు.విద్యార్థుల భవిష్యత్తు కోసం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు పరీక్షలకు ముందు అవసరమైన సామగ్రి అందించడంతో పాటు వారికి ప్రోత్సాహం అందించారు. మన కోసం మనం సంస్థ చేస్తున్న సేవలను కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు అభినందించారు.
ఈ కార్యక్రమంలో నిజాంసాగర్ మండల విద్యాధికారి తిరుపతిరెడ్డి, అచ్చంపేట కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు వెంకటరామిరెడ్డి,నిజాంసాగర్ మండల అధ్యక్షులు సంతోష్ కుమార్,ప్రధాన కార్యదర్శి సురేందర్,రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షులు భాస్కర్ గౌడ్, కలకొండ నారాయణ, మహమ్మద్ నగర్ మండల అధ్యక్షులు వెంకట్రామ్ రెడ్డి,పండరి తదితర నాయకులు సభ్యులు పాల్గొన్నారు.