ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సారధ్యంలో ఇంటింటికి సంక్షేమ పథకాలు..ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడమే లక్ష్యం..సర్పంచ్ కూండ్ల నాగేశ్వరి లక్ష్మీ నరసయ్య
వరికుంటపాడు మార్చ్ 8 మన న్యూస్:-(నాగరాజు కె )
ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇల్లు నిర్మించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని సర్పంచ్ కూండ్ల నాగేశ్వరి లక్ష్మీ నరసయ్య దంపతులు అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేద ప్రజల సంక్షేమం కోసం ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారన్నారు అటువంటి సంక్షేమ పథకాలను రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి అందించడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త అడుగులు ముందుకు వేయాలని అన్నారు ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ నియోజకవర్గం ప్రజల సంక్షేమం కోసం ప్రతినిత్యం పాటుపడుతున్నారని అటువంటి శాసనసభ్యులు ఎవరూ లేరన్నారు. మెట్ట ప్రాంతమైన ఉదయగిరి నియోజకవర్గం లోని వరికుంటపాడు మండలంలో జన్మించి ఎంతో ఉన్నతమైన చదువులు చదివే అమెరికా దేశంలో ఉద్యోగం చేస్తూ ఉదయగిరి నియోజకవర్గం లో అభివృద్ధి సంక్షేమం శూన్యంగా ఉందని గుర్తించి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు ముందుకు వచ్చి ఎంతోమంది పేద ప్రజలకు సేవా కార్యక్రమాలు నిర్వహించారన్నారు. కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నియోజకవర్గంలోని ఎనిమిది మండలాలలో ఉండేటువంటి ప్రజలకు నారా లోకేష్ బాబు స్ఫూర్తితో ఎన్టీఆర్ ఆరోగ్య రథాన్ని ఏర్పాటు చేసి ఆ రథం ద్వారా ప్రతి ఒక్కరికి వైద్యం అందించే విధంగా అడుగులు ముందుకు వేశారన్నారు. అంతేకాకుండా నిరుపేదల కుటుంబాలలో ఆనందాన్ని నింపారని గుర్తు చేశారు. ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సారథ్యంలో తూర్పు రొంపిదొడ్ల గ్రామంలో ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇంటి స్థలాలతో పాటు ఇంటి నిర్మాణాలు కూడా చేపట్టే దిశగా అడుగులు ముందుకు వేస్తున్నామని వారు అన్నారు.