మన ధ్యాస,నిజాంసాగర్ ,( జూక్కల్ )మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” 99 రోజుల యాక్షన్ ప్లాన్ కార్యక్రమం మార్చి 6 నుండి జూన్ 12 వరకు రాష్ట్రవ్యాప్తంగా అమలు కానుంది.ఈ కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు,పెండింగ్ ఫైళ్లపరిష్కారం,పారిశుద్ధ్య డ్రైవ్ వంటి పలు కార్యక్రమాలు గ్రామం నుండి రాష్ట్ర స్థాయి వరకు నిర్వహించనున్నారు. నిజాంసాగర్ మండల కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమాన్ని కామారెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షులు ఏలే మల్లికార్జున్,బంజపల్లి గ్రామ సర్పంచ్ ఏలే సుగుణ తో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత చేరువ కావడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా అమలు కావడమే ఈ 99 రోజుల ప్రణాళిక ప్రధాన లక్ష్యమని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ అనీస్, పంచాయతీ కార్యదర్శి బీమ్ రావు,నాయకులు లక్ష్మందాస్, రాము రాథోడ్ ,రమేష్,తదితరులు ఉన్నారు.

By RAHEEM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *