బంగారుపాళ్యం, మన ధ్యాస, ఫిబ్రవరి 6
చిత్తూరు జిల్లా, పూతలపట్టు నియోజకవర్గం, బంగారుపాళ్యం మండల టిడిపి వాణిజ్య విభాగం మాజీ అధ్యక్షుడు భాష్యం వంశీ పుట్టినరోజు వేడుకలు మండల కేంద్రంలోని భాష్యం భవనం ముందు పండుగ వాతావరణం లా ఘనంగా నిర్వహించారు. ముందుగా కేక్ కట్ చేసి అందరికీ పంచారు.అనంతరం అంగరంగ వైభవంగా బాణాసంచా పేల్చి న తరువాత అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రమణ, హేమచంద్ర నాయుడు, జనసేన బాల,టిడిపి నాయకులు, కార్యకర్తలు, వంశీ అభిమానులు,బంధువులు, స్నేహితులు తదితరులు పాల్గొన్నారు.