కలిగిరి, మార్చి 04,(మన న్యూస్ ప్రతినిధి )నాగరాజు కె.

ఉదయగిరి నియోజకవర్గం కలిగిరి మండలంలోని పోరంపాడు గ్రామపంచాయతీ చెరువులో భారీగా మట్టిని తరలిస్తున్న వైనం దాదాపుగా 5 లారీల నుండి 6 లారీల తో మట్టిని బయటికి తరలిస్తున్న వైనం.ఈ విశయం పై,మీడియా మిత్రులు వెళ్లి అక్కడ జెసిబి మరియు లారీ డ్రైవర్ల ను వివరణ అడగగా మా సూపర్వైజర్ మాకు చెప్పారు అందు వలన మేము మట్టిని తరలిస్తున్నామని వారు తెలియజేశారు. ఈ విషయంపై ఆర్ అండ్ బి రోడ్డు సూపర్వైజర్ అయినటువంటి నరసింహారెడ్డి కి ఫోన్ చేసి మీడియా వారు అడగగా మేము పర్మిషన్ తీసుకున్నాము, పర్మిషన్ లెటర్ మాదగ్గెర ఉంది అని అతను చెప్పడం జరిగినది.అనంతరం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏయి ఉన్నటువంటి రోజ్ మేరీ, కి ఫోన్ చేసి మీడియా మిత్రులు అడగగా మేము ఇంకా పర్మిషన్ ఇవ్వలేదు మా దగ్గరి కి సోమవారం వచ్చిరు మేము ఇంకా పర్మిషన్ ఇవ్వలేదు,ఈరోజు మాట్లాడుతాము అని మేము చెప్పాము వాళ్ళు ముందుగానే మట్టిని తరలిస్తున్నారు, అనీ ఆమే చెప్పింది. నాకు తెలీకుండా మట్టి నీ తొలితున్నారు,నేను వెంటనే మట్టి తొలడాన్ని ఆపే పిస్తాను అని ఆమె చెప్పిడం జరిగింది.ఈ విషయంపై స్థానిక ప్రజలందరూ గత రెండు రోజులు నుండి మట్టి నీ బారిగా తరలిస్తున్నారు అని వారు మండిపడుతున్నారు.విషయం పై ఉన్నతాధికారులు స్పందించి తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆ గ్రామ ప్రజలు తెలియజేశారు.
