చిత్తూరు, మనధ్యాస, ఫిబ్రవరి24. రిపోర్టర్ కమల్ రెడ్డి
సమాచార హక్కు చట్టం కార్యకర్తల సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా చిత్తూరు జిల్లా ఐరాలకు చెందిన పాటుకూరి నరేష్ ను ఆ సంఘం సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. విజయవాడ ఆర్టిఐ కార్యకర్తల సంఘం రాష్ట్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో వ్యవస్థాపక అధ్యక్షులు జి. ముత్తు నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు పాటుకూరి నరేష్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమాచార హక్కు చట్టాన్ని ఉన్నత ఆశయంతో అమలుపరుస్తున్నాయని అన్నారు.వాటిని క్షేత్రస్థాయిలో తీసుకువెళ్లేందుకు సమాచార హక్కు చట్టం కార్యకర్తల సంఘం సభ్యులు ఎప్పుడు ముందుంటారని కొనియాడారు. అనంతరం సభ్యులు వారిని అభినందించారు.