మన ధ్యాస,నిజాంసాగర్, జుక్కల్ నిజాంసాగర్ మండలంలోని గోర్గల్ గ్రామ శివారులోని బీడీల మైసమ్మ ఆలయం వద్ద ఘనంగా కుస్తీ పోటీలను నిర్వహించారు. ఆలయ ఉత్సవాలను పురస్కరించుకొని సోమవారం ఈ కుస్తీ పోటీలు ఎంతో ఉత్సాహంగా నిర్వహించారు.గ్రామ పెద్దల ఆధ్వర్యంలో కుస్తీ పోటీలు ఏర్పాటు చేయగా,ఈ కుస్తీ పోటీలను తిలకించేందుకు మహారాష్ట్ర,కర్ణాటక,జహీరాబాద్,నారాయణఖేడ్ వివిధ గ్రామాల నుండి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. చిన్నారుల నుంచి మొదలైన కుస్తీ పోటీలు మల్ల యోధులు ఆసక్తి చూపించారు.కుస్తీ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి గ్రామ పెద్దలు మాజీ సీడీసీ చైర్మన్ పట్లోళ్ల దుర్గారెడ్డి,మహేదర్ రెడ్డి, అజ్జం దుర్గయ్య లు కలిసి నగదు అందజేశారు. కుసి పోటీలను తిలకించేందుకు వచ్చిన ప్రజలకు భోజనం సౌకర్యం కల్పించారు. కుస్తీ పోటీల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసుల ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో రామగౌడ్,గోలి లక్ష్మణ్, శ్రీకాంత్ రెడ్డి,ప్రకాష్,పాండరి,మలేష్,తదితరులు ఉన్నారు.