కలిగిరి, మన న్యూస్, ఫిబ్రవరి 20,(నాగరాజు కె ).

కలిగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు హాస్పిటల్ డెవలప్ మెంట్ సొసైటి కమిటీ సమావేశం ను కమిటీ సమావేశం హెచ్ డి ఎస్ కమిటీ చైర్మన్ మెట్టుకూరు శిరీష అధ్యక్షతన,కమిటీ సభ్యుల తో కలసి సమావేశం నిర్వహించుకోవడం జరిగింది.ఆసుపత్రి కి వచ్చే రోగుల కు నాణ్యమైన వైద్య సేవలు ను అందించాలని,ప్రజలకు అందుబాటులో ఉండాలని వైద్యాధికారులకు సూచనలు చేశారు.కలిగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంవారు ప్రజలకు అందించే వైద్య సేవల పై సంతృప్తి వ్యక్తం చేశారు.పిజి గైనకాలజీ సీటును పొందిన వైద్యాధికారిణి డాక్టర్ బిజ్జo గీతారెడ్డి ని ఏంపిపి శిరీష రెడ్డి,ఎంపిడిఓ కె.ప్రత్యూష, తెలుగుదేశం పార్టీ వులకొల్లు సర్పంచ్ పూసాల,వెంగపనాయుడు,జిర్రావారిపాలెం,వై,సతీష్,వెలగపాడు,కుమ్మర కొండూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ లు శాలువా తో సత్కరించి అభినందనలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో, కలిగిరి మండల అభివృద్ధి అధికారి కె.ప్రత్యూష కలిగిరి పిహెచ్ సి వైద్యాధికారిణి డాక్టర్ బిజ్జo గీతారెడ్డి,డాక్టర్ ఆకాష్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు,పి హెచ్ సి సిబ్బంది పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *