
మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:ఏలేశ్వరం మండలం తిరుమాలి గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని మండల సర్వసభ్య సమావేశంలో తిరుమాలి సర్పంచ్ సూతి వీర కృష్ణ ప్రసాద్ కోరారు.ఈ సందర్బంగా సూతి వీరకృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ తిరుమాలి గ్రామం నుండి నిత్యం అనేక మంది విద్యార్థులు,ఉద్యోగులు ఇతర ప్రాంతాలకు వెళ్తుంటారు.గ్రామానికి చెందిన సుమారు 20 మంది విద్యార్థులు ఇంటర్ చదువుతున్న వారు,
ఇంజనీరింగ్ చదువుతున్న వారు రవాణా సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే సత్యప్రభ ఆర్టీసీ అధికారుల దృష్టికి తీసికెళ్లి బస్సు సౌకర్యం కల్పించాలని కోరారు.బస్సు సౌకర్యం సరిగ్గా లేకపోవడం వల్ల మహిళలు, విద్యార్థులు పడుతున్న ఈ కష్టాలను దృష్టిలో ఉంచుకుని, వెంటనే బస్సు సర్వీస్ ఏర్పాటు చేయాలని సర్పంచ్ సూతి వీర కృష్ణ ప్రసాద్ కోరారు.