గోపన్నపాలెం గ్రామమునకు మహర్దశ.50 లక్షల రూపాయలతో సీ సీ రోడ్డు నిర్మాణం.

జలదంకి,ఫిబ్రవరి 09,(మన న్యూస్ ప్రతినిధి) నాగరాజు కె.)

జలదంకి మండలం గోపన్నపాలెం పంచాయతీ పరిధిలోని అప్రోచ్ రోడ్డు నుండి గోపన్నపాలెం గ్రామం లోనికి 50 లక్షల రూపాయల పంచాయతీరాజ్ శాఖ నిధులతో నిర్మించిన సిమెంట్ రోడ్డును ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ అధికారికంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు మరియు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు , ఉప ముఖ్యమంత్రివర్యులు కొణిదల పవన్ కళ్యాణ్ సమర్థ నాయకత్వం మరియు సహకారంతో కూటమి ప్రభుత్వం గ్రామీణాభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ఉదయగిరి నియోజకవర్గంలో గత 30 సంవత్సరాలుగా సరైన రోడ్డు సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్న అనేక గ్రామాలకు కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పంచాయతీరాజ్ శాఖ నిధుల ద్వారా రోడ్ల నిర్మాణాలకు మంజూరు చేస్తూ, అభివృద్ధి పనులను వేగవంతంగా చేపడుతోందని పేర్కొన్నారు.
గ్రామాలకు మెరుగైన రవాణా సదుపాయాలు కల్పించడం ద్వారా విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు మరింత చేరువవుతాయని, రైతులకు తమ ఉత్పత్తులను మార్కెట్‌కు సులభంగా తరలించే అవకాశం లభిస్తుందని ఆయన తెలిపారు. గోపన్నపాలెం గ్రామంలో నిర్మించిన ఈ సిమెంట్ రోడ్డు గ్రామాభివృద్ధికి మైలురాయిగా నిలుస్తుందని, ప్రజల జీవన ప్రమాణాలను మరింత మెరుగుపరుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *