కొండాపురం, మన న్యూస్, ఫిబ్రవరి 08,(నాగరాజు కె ).

పవన్ సార్, మా ఊరికి రోడ్డు వేయండి అంటూ విద్యార్ధులు సామాజిక మాధ్యమాల ద్వారా పంపిన సందేశం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను కదిలించింది. బురద రోడ్డులో ప్రతి రోజు స్కూలుకు వెళ్లడానికి వారు పడుతున్న ఇబ్బందులు, వారి ఆవేదన చూసి చలించిపోయారు.తక్షణమే అధికారులతో వివరాలు తెప్పించుకుని గజ్జలవారి పల్లి కి గ్రామానికి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సహకారంతో 1.6 km సుమారు 86 లక్షలు రోడ్డు మంజూరు చేయడం జరిగినది.ఈ సందర్భంగా ఉదయగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కాకర్ల సురేష్ , ఉదయగిరి నియోజకవర్గ జనసేన పార్టీ పిఓసి కొట్టే వెంకటేశ్వర్లు గారు టిడిపి, జనసేన, బిజెపి నాయకులు గజ్జల వారిపల్లి సందర్శించి గ్రామ ప్రజలు విద్యార్థులను కలుసుకుని రోడ్డు మంజూరు చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కి కృతజ్ఞతలు తెలుపడం జరిగింది.ఈ కార్యక్రమం కొండాపురం మండల జనసేన అధ్యక్షులు ఆకుల వెంకట్, టీడీపీ మండల అధ్యక్షులు పోలినేని చంద్రబాబు, బీజేపీ కన్వీనర్ కదిరి రంగరావు, జనసేన నాయకులు నిమ్మలపల్లి రామ చైతన్య, జిల్లా కార్యదర్శి ఆలూరి రవీంద్ర, మండల అధ్యక్షులు రసూల్ పఠాన్, బండారు సత్యనారాయణ, సురేంద్ర రెడ్డి, నా సేన నా వంతు కాశీరావు, పెట్లూరి కిరణ్, నీటి సంఘము అధ్యక్షులు ఆకుల వెంకటేశ్వర్లు, కొండాపురం మండలం నాయకులు రాఘవేంద్ర, వేముల మనీష్, గిరి, మధు, చిరంజీవి, రమేష్ మరియు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *