తవణంపల్లి ఫిబ్రవరి 8 మన ద్యాస

చిత్తూరు జిల్లా సంతపేట చెరువు పరిసర ప్రాంతాల్లో జంట ఏనుగులు సంచరిస్తున్నాయని సమాచారం అందినట్లు తవణంపల్లి ఎస్సై డాక్టర్ నాయక్ తెలిపారు. ఈ ఏనుగులు తవణంపల్లి మండలం వైపు కదులుతున్నట్లు ప్రాథమిక సమాచారం ఉందన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రైతులు పొలాల వైపు వెళ్లవద్దని, పశువులను ఇళ్ల వద్దే ఉంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఏనుగులు కనిపించినా వెంటనే అటవీ శాఖ లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ప్రజల భద్రతే లక్ష్యంగా పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *