మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) విద్యార్థులకు నాణ్యత మైన భోజనం అందించాలని సర్పంచ్ కుమ్మరి శేఖర్ అన్నారు. పిట్లం మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని సర్పంచ్ ఆదివారం ఆకస్మికంగా సందర్శించారు.ఈ సందర్భంగా విద్యార్థినులకు అందుతున్న వసతులను ఆయన అడిగి తెలుసుకున్నారు.పాఠశాల వంటగదిని పరిశీలించి విద్యార్థినులకు అందిస్తున్న భోజనం నాణ్యతో మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని సూచించారు.వంట గదిని నిరంతరం శుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. సర్పంచ్ వెంట జుక్కల్ యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షుడు ఇమ్రోజ్,నాయకులు అశోక్, నవీన్,తదితరులు ఉన్నారు.