
మన ధ్యాస,నిజాంసాగర్ (జుక్కల్) జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని బిచ్కుంద మున్సిపాలిటీ 10వ వార్డులో కౌన్సిలర్ అభ్యర్థి మఠం మానసకు మద్దతుగా ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోంది.ఈ సందర్భంగా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు స్వయంగా ప్రచారంలో పాల్గొని వార్డు ప్రజలను కలుసుకుని అభ్యర్థిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.ప్రచార కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే,స్థానిక నాయకులు,పార్టీ కార్యకర్తలు ఇంటింటికి తిరిగి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు.ఈ అనంతరం ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల ప్రజలకు ఎంతో మేలు జరుగుతోందని పేర్కొన్నారు. ఈ అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగాలంటే స్థానికంగా బలమైన నాయకత్వం అవసరమని,అందుకే మఠం మానసను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
మఠం మానస ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటారని,వార్డులోని ప్రతి సమస్య పరిష్కారానికి కృషి చేస్తారని ఆయన తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజల సహకారం అవసరమని,చేతి గుర్తుకు ఓటు వేసి మఠం మానసను గెలిపించాలని పిలుపునిచ్చారు.*అనంతరం కౌన్సిలర్ అభ్యర్థి మఠం మానస* మాట్లాడుతూ.. ప్రజలు తనపై నమ్మకం ఉంచి గెలిపిస్తే వార్డులో ఉన్న డ్రైనేజీ సమస్యలు,తాగునీటి ఇబ్బందులు, మురికికాలువల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు.అలాగే వీధి దీపాల ఏర్పాటు,రోడ్ల అభివృద్ధి,పారిశుధ్య పనులు మెరుగుపరచడం వంటి కార్యక్రమాలను ప్రాధాన్యతగా చేపడతానని హామీ ఇచ్చారు.వార్డు అభివృద్ధే తన లక్ష్యమని, ప్రతి ఇంటి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని, ప్రజలు చేతి గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆమె కోరారు.
