వింజమూరు, మన ధ్యాస, డిసెంబర్ 31, (నాగరాజు కె ).

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వైసిపి నేత అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు అనైతికమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి,అంబటి రాంబాబు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ డిమాండ్ చేశారు.శనివారం ఎమ్మెల్యే ఒక ప్రకటనలో మాట్లాడుతూ 50 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన ప్రజా నాయకుడు ప్రపంచ దేశాల్లో తెలుగువారికి గుర్తింపు తీసుకు వచ్చి ప్రజల హృదయాలను గెలిచిన నేత దేశ రాజకీయాలను శాసించగల శక్తివంతుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని, ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ దేశంలో ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్న ముఖ్యమంత్రిపై వైసీపీ నేత అంబటి రాంబాబు దూషించడం అనుచిత వ్యాఖ్యలు చేయడం అనైతికమని తెలుగు రాష్ట్రాల ప్రజలకు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి అంబటి రాంబాబు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో వైసిపి నాయకులు చేసిన దూషణలకు రాష్ట్ర ప్రజలు వైసీపీ పార్టీకి 11 సీట్లు ఇచ్చి బుద్ధి చెప్పిన వీరికి ఇంకా జ్ఞానం రాలేదన్నారు. అంబటి రాంబాబు నాలుక అదుపులో పెట్టుకోకపోతే టిడిపి కార్యకర్తలు నేరుగా బుద్ధి చెప్పి తీరుతారని హెచ్చరించారు,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *