మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:వరుపుల తమ్మయ్య బాబు కుటుంబాన్ని పరామర్శించిన ఎం ఎం పల్లం రాజు జనసేన పార్టీ సీనియర్ నాయకులు, అందరి అప్యాయతను చూరగొన్న వరుపుల తమ్మయ్య బాబు ఇటీవల స్వర్గస్తులైన సంగతి మనందరికీ విదితమే. ఎం ఎం పళ్లంరాజు శనివారం వరుపుల తమ్మయ్య బాబు నివాసానికి వెళ్లిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ రక్షణ శాఖ మంత్రి ఎం ఎం పళ్లంరాజు తమ్మయ్య బాబు చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం తమ్మయ్య బాబు కుమారుడు వరుపుల సాయి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి,వారికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కష్ట సమయంలో కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని, తమ్మయ్య బాబు ఆత్మకు శాంతి చేకూరాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు, వరుపుల తమ్మయ్యబాబు (చిట్టిబాబు), వరుపుల సూరిబాబు, కె. శ్రీను, పరుపుల అప్పనపల్లి, కోనపు రెడ్డి దుర్గ,
జనసేన నాయకులు, తమ్మయ్య బాబు అభిమానులు తదితరులు పాల్గొన్నారు

By DURGASRINIVAS

Good

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *