
మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో ప్రత్తిపాడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముద్రగడ గిరిబాబు పార్టీ శ్రేణులతో కలిసి తిరుమల లడ్డుపై కూటమి ప్రభుత్వం చేస్తున్న అసత్య ప్రచారాలను ఖండిస్తూ ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి తొలి పావంచా వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ముద్రగడ గిరిబాబు మీడియాతో మాట్లాడుతూ కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి పవిత్ర లడ్డూ ప్రసాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు కూటమి నేతలు చేస్తున్నవి పూర్తిగా రాజకీయ ప్రేరేపిత అసత్యాలని మరోసారి స్పష్టమైందని ముద్రగడ గిరిబాబు అన్నారు.లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందనే ప్రచారంలో వాస్తవం లేదని కోర్టులో సమర్పించిన చార్జీషీట్ ద్వారా స్పష్టమవుతున్నా,కూటమి నేతలు ఇంకా విష ప్రచారాన్ని కొనసాగించడం దురదృష్టకరమన్నారు.కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ఆడుకుంటూ,రాజకీయ లబ్ధి కోసం అబద్ధాలు ఆడుతున్న కూటమి నేతలకు ఆ సత్యదేవుడు మంచి బుద్ధి ప్రసాదించాలని వేడుకున్నట్లు ముద్రగడ గిరిబాబు మీడియాకు తెలిపారు.రాజకీయాల కోసం దేవుడిని,శ్రీవారి లడ్డు ప్రసాదాన్ని అపవిత్రం చేస్తున్న వారి కుట్రలను ప్రజలందరూ గమనించాలని గిరిబాబు మీడియా ముఖంగా కోరారు.ఈ కార్యక్రమంలో వాసిరెడ్డి జమీల్, రామిశెట్టి నాని,అడపా సోమేశ్, గొల్లు చిన్న దివాణం,శెట్టిబత్తుల కుమార్ రాజా,కొండపల్లి అప్పారావు,గణేశుల బాబ్జి తదితర వైసీపీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.