మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) వేసవి కాలంలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆర్‌డబ్ల్యూ‌ఎస్ ఏఈ సుమలత అన్నారు.మొహమ్మద్‌నగర్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..వేసవి కాలంలో తాగునీటి ఎద్దడి నివారణకు సమగ్ర వేసవి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాల్సిన అవసరం ఉందని తెలిపారు.ఇందుకు సంబంధించి అవసరమైన సూచనలు,సలహాలు అందిస్తూ అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సమావేశంలో ఎంపీడీవో సత్యనారాయణరెడ్డి,ఎంపీఓ అనిత, సర్పంచులు రమేష్,హరిన్,రఫీ,తదితరులు ఉన్నారు.

By RAHEEM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *